KTR : ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యూడీషల్ కమిషన్ ఏర్పాటు చేయాలి : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-06-28 15:08:11  IST  )

ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం(SLBC Tunnel Accident)పై జ్యూడీషల్ కమిషన్ (Judicial Commission) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు.

KTR : ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యూడీషల్ కమిషన్ ఏర్పాటు చేయాలి : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం(SLBC Tunnel Accident)పై జ్యూడీషల్ కమిషన్ (Judicial Commission) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదం పైన అందుకు బాధ్యులైన వారిపైన విచారణ చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని.. తాజా ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందన్నారు.

ఇంతకు ముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదని., బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి సహా, అనేక అంశాలపై న్యాయ కమిషన్‌ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారని..రాష్ట్రంలో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక న్యాయ కమీషన్‌లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

తాజా ప్రమాదాలపై న్యాయ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని మేము మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సొరంగ ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు చెప్పిందే చెబుతున్నారని విమర్శించారు. ఎనిమిది మంది తప్పిపోగా..యంత్రాలకు 300 కోట్ల నష్టం వాటిల్లిందని..అసలు ప్రభుత్వం సొరంగం పనులు పునఃప్రారంభించే ముందు ఎలాంటి సాంకేతిక అధ్యాయనం చేయకపోవడంతోనే ఈ ఘటనకు కారణమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే టన్నెల్ ప్రమాదంపై న్యాయవిచారణ జరిపించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నామని కేటీఆర్ తెలిపారు.

click for tweet ..

Next Story