- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో BJP పిటిషన్‌పై నేడు తీర్పు

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. అభ్యంతరాలు ఉంటే ఇవాళ తుది వాదన వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తు దశలో ఉండగా ఫామ్‌హౌస్‌లోని వీడియోలు, ఆడియోలు సీఎం కేసీఆర్‌కు చేరడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మీడియాకు రిలీజ్ చేసిన ఫుటేజ్‌ను కోర్టుకు అందించారు. దీంతో పిటిషనర్లు అందించిన ఫుటేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటామన్న హైకోర్టు ఇవాళ వాదనలు ముగిసిన తర్వాత తుది తీర్పు వెల్లడించనుంది.
Also Read...
Next Story






