- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
by Naga Rani Yarlagadda |
గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల (Loksabha Elections 2024) సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల (Loksabha Elections 2024) సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల్లో.. బీజేపీ రిజర్వేషన్లు (BJP Reservations) రద్దు చేస్తుందని అన్నారని, అందులో నిజం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై పరువునష్టం దావా వేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల వల్ల బీజేపీ దెబ్బ తినిందని, ప్రజల్లో అపోహలు కలిగేలా ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు.
ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పేర్కొంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టు విచారణ చేయగా.. ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. దాంతో న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు.
Next Story






