JUDGEMENT DAY 2024 : కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్

by Sathputhe Rajesh |

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 8 గంటలకు ప్రారంభం కానుంది.

JUDGEMENT DAY 2024 : కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ కానుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియకు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టే చాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెంట్ కీలకంగా మారనుంది. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.18లక్షల మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా, సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే చాన్స్ ఉంది. ఇక, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశాు. పార్టీ ఏజెంట్లను పోలీసులు క్షణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతి ఇస్తున్నారు.

Next Story