Govt Hospitals: సర్కార్ దవాఖానలో జడ్జి ప్రసవం.. మంత్రి దామోదర రాజనర్సింహ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చారు.

Govt Hospitals: సర్కార్ దవాఖానలో జడ్జి ప్రసవం.. మంత్రి దామోదర రాజనర్సింహ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి (Jyothirmayi) వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) జడ్జీకి తాజాగా అభినందనలు తెలియజేశారు. (Vemulawada Regional Government Hospital) వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్య సేవలు పొంది తన మొదటి కాన్పు 2023 లో ప్రసవం ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది ప్రజలకు సర్కార్ దవాఖానలపై నమ్మకాన్ని పెంచినందుకు మంత్రి దామోదర రాజనర్సింహ వేములవాడ జూనియర్ జడ్జి జ్యోతిర్మయికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను ఎంతో బలోపేతం చేశామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలను, నిష్ణాతులైన డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని తెలియజేశారు. ప్రజలందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు.

Next Story