- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Azharuddin: జూబ్లీహిల్స్ బరిలో నేనే ఉన్నా.. కాంగ్రెస్ నేత అజారుద్దీన్ సంచలన ప్రకటన
జూబ్లీహిల్స్ (Jubilee Hills) బరిలో నేనే ఉన్నా అంటూ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ (Jubilee Hills) బరిలో నేనే ఉన్నా అంటూ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ (Azharuddin) సంచలన ప్రకటన చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక (Jubilee Hills Bypoll) అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ వచ్చిందని, ఆఖరి వరకు పోరాడి.. తక్కువ ఓట్లతో ఓడిపోయినట్లు తెలిపారు.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ (Congress) పార్టీకి వచ్చేలా తను పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, పార్టీలో ఉన్న కొంత మంది వ్యక్తులు కావాలని తనపై కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియా, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని వాపోయారు. తనకు టికెట్ ఇవ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లాంటి పెద్దల ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు. (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తెచ్చుకొని, గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా అందిస్తామని అన్నారు.
కాగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక ఫీవర్ స్టార్ట్ అయింది. అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోను, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చానీయంశంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన అజారుద్దీన్‌కు మళ్లీ అవకాశం ఇవ్వరని.. ఈ సారి కొత్త అభ్యర్థికి వారికి చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి లాంటి వారి పేర్లు పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.






