ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్.. గేమ్ చేంజర్ గా మారబోతున్న ఆఖరి ఓట్లు

by Prasad Jukanti |   (  Updated:2025-11-11 12:46:00  IST  )

జూబ్లీహిల్స్ పోలింగ్ ముంగిసింది.

ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్.. గేమ్ చేంజర్ గా మారబోతున్న ఆఖరి ఓట్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) పోలింగ్ ముగిసింది. జూబ్లీహిల్స్ తో పాటు బిహార్ అసెంబ్లీకి సెకండ్ ఫేజ్ (Bihar second phase polling), మరో 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగిసిపోయింది. 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. కాగా ఈసీ తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ లో సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు అయింది. 2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 48.42 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్లలో ఉండటం వల్ల గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story