- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: తెలంగాణలో డబుల్ డోస్ పాలిటిక్స్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ నాడే జూబ్లీహిల్స్ లో పోలింగ్
జూబ్లీహిల్స్ బై పోల్‍పై స్థానిక ఎన్నికల ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు పీక్స్ చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ షెడ్యూల్‍తో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలవగా తాజాగా ఇవాళ జూబ్లీహిల్స్ బై పోల్‍కు (Jubilee Hills by-election) కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని రెండు విడతల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ (MPTC ZPTC ) స్థానాకలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ రోజే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగబోతుండటంతో తెలంగాణలో డబుల్ డోస్ రాజకీయం ఇంట్రెస్టింగ్‍గా మారబోతోంది.
ఇక్కడ కౌంటింగ్.. అక్కడ కాస్టింగ్:
ఇన్నాళ్లు పార్టీల మధ్య డైలాగ్‍వార్లతో నడిచిన రాష్ట్ర రాజకీయానికి పరీక్షా సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పాలనకు, ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రజలు తీర్పు ఇచ్చే టైమ్ వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ లో బై పోల్ ఎన్నికల కోసం పార్టీలు తమ అస్త్రశస్త్రాలు బయటకు తీస్తున్నాయి. అయితే నవంబర్ 11న జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. అయితే అదే రోజున రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ జరుగుతుంటే మరోవైపు జూబ్లీహిల్స్ లో ఓటింగ్ కాస్టింగ్ జరగనుండటంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారనుందనే చర్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ పై లోకల్ ఎఫెక్ట్?:
రాష్ట్రంలో ఐదు దశల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు ( local body elections) నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రిజర్వేషన్ల అంశంలో దాఖలైన పిటిషన్లపై కోర్టు గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూల్ ఫైనల్ కానుంది. దీని ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకు పోలింగ్, ఓట్ల లెక్కింపు జూబ్లీహిల్స్ పోలింగ్ కంటే ముందే జరిగిపోనుంది. వీటికి పోలింగ్, కౌంటింగ్ తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడద నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న జరగనుంది. అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కంటే ముందే గ్రామీణ తెలంగాణలో ఓటర్ల మూడ్ ఏంటి అనేది తేలిపోనుంది. దీంతో సర్పంచ్ ఓట్ల ఫలితాలు జూబ్లీహిల్స్ ఓటర్లపై ప్రభావం చూపనుందా అనే చర్చ తెరమీదకు వస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‍కు పట్టం కడితే అర్బన్ తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఒక వేళ ఎఫెక్ట్ చూపితే అది ఏ పార్టీకి సానుకూలం మరే పార్టీకి వ్యతిరేకం అనేది నవంబర్ 14న తేలనుంది.






