- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maganti Gopinath మరణం హైదరాబాద్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్సీ కవిత
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరణం హైదరాబాద్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్యే అకాల మరణంపై ఆమె సంతాపం తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరణం (Jubilee Hills MLA dies) హైదరాబాద్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) అన్నారు. ఎమ్మెల్యే అకాల మరణంపై ఆమె సంతాపం తెలిపారు. ఈ క్రమంలో "జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, శోఖార్తులైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను." అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎమ్మెల్యే ఈ నెల 5న పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో 5.45 గంటలకు చివరి శ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.






