- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీదే బంపర్ విక్టరీ!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. దీంతో సంస్థలన్నీ నివేదికలు విడుదల చేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. దీంతో సంస్థలన్నీ నివేదికలు విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మూడు పార్టీలూ గెలుపుపై ధీమాలో ఉన్నాయి. ఈ ఉపఎన్నిక పోరులో హోరాహోరీగా తలపడ్డాయి. అయితే.. సర్వేలన్నీ ఒక పార్టీకి జై కొట్టాయి. చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS 43%, BJP 6% ఓట్లు అని.. పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 48%, BRS 41%, BJP 6% ఓట్లు అని.. నాగన్న సర్వే: కాంగ్రెస్ 47%, BRS 41%, BJP 8% ఓట్లు అని.. ఆపరేషన్ చాణక్య: 8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయమని సర్వేలో తేలినట్లు పేర్కొన్నాయి. JANMINE సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, BRS 41.5%, BJP 11.5% ఓట్లు వస్తాయని తేల్చాయి.
కాగా, జూబ్లీహిల్స్‌లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, ఓటర్లు ఇచ్చే తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read More... బిహార్ ఎగ్జిట్ పోల్స్: ఈసారి అనూహ్యంగా ప్రజల తీర్పు!






