- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Anil Kumar: ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ శనివారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను కలిశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: (Jubilee Hills by-election) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) శనివారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ (MP Anil Kumar Yadav)ను కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసిన నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ విజయం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయనకు భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. కాగా, అనిల్ కుమార్ యాదవ్ తండ్రి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నం చేయడం గమనార్హం. తనకు టికెట్ దక్కక పోవడంతో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేయగా పార్టీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌లు ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించారు.






