- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ బైపోల్ అప్‌డేట్.. కేటీఆర్ ప్రచారం షెడ్యూల్ విడుదల
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు జోరుగా ప్రచారం పాల్గొంటున్నారు. మొత్తం 40 మందితో కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సైతం విడుదల చేసింది. అందులో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ నెల 31 నుంచి నవంబరు 5 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రచారం హోరెత్తనుంది.
ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి (BRS) జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. తాజాగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొనబోయే డోర్ టూ డోర్, రోడ్ షోలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 31న షేక్‌పేట్, నవంబర్ 1న రెహమత్‌నగర్, 2న యూసుఫ్‌గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావునగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో కేటీఆర్ డోర్ టూ డోర్ ప్రచారం కొనసాగనుంది. అదేవిధంగా నవంబర్ 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో నవంబర్ 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీ (Bike Rally)తో కేటీఆర్ ప్రచారం ముగియనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.






