- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బై పోల్.. వచ్చేనెల 6న ఈసీ పర్యటనకు ప్రాధాన్యం
బిహార్ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బై పోల్.. వచ్చే నెల 6న ఈసీ బృందం పర్యటనకు ప్రాధాన్యం

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 5 నుంచి 15 వరకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదాలు కొనసాగుతోన్న వేళ ఓటరు జాబితాలో సవరణలు సెప్టెంబర్ 30 నాటి పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 6న ఈసీ బృందం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించేందుకు బిహార్‌లో పర్యటించనుండటం ప్రధాన్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా, ఓటరు జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రతా చర్యలపై స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, ఇతర రాష్ట్రాలకు వలసలు అత్యంత కీలకంగా మారనున్నాయి.
ఇక బిహార్ అసెంబ్లీ (Assembly) ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అకాల మరణంతో అక్కడ బై పోల్ అనివార్యమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఓటరు జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ (329 నుంచి 408కి పెంపు), భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలాగైన విజయం సాధించి తిరిగి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ (BRS) రంగంలోకి దిగింది. మరోవైపు అధికార కాంగ్రెస్ (Congress) 22 నెలల పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఓ పరీక్షలా భావిస్తోంది. అందుకు తగినట్లుగానే బరిలో బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. అదేవిధంగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా తమ అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 1.23 లక్షల ముస్లిం ఓట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. వారు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.






