- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ బై పోల్ అప్‌డేట్.. CM రేవంత్ తాజా క్యాంపెయిన్ షెడ్యూల్ ఇదే!
జూబ్లీహిల్స్ బైపోల్‌ను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక ప్రచారం హోరెత్తనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ బైపోల్‌ను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక ప్రచారం హోరెత్తనుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు జోరుగా నియోజకవర్గ పరిధిలో డోర్-టు-డోర్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా ఆ పార్టీ విడుదల చేసింది. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు, AICC ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రచారానికి సంబంధించి సీఎం షెడ్యూల్‌ను ఆ పార్టీ ఖరారు చేసింది. ఇవాళ రాత్రి 7 గంటలకు వెంగళరావు నగర్‌లో, 8 గంటలకు సోమాజిగూడలో, అదేవిధంగా రేపు రాత్రి 7 గంటలకు బోరాబండలో పార్టీ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు.
Next Story






