- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ బై పోల్ అప్‌డేట్.. 11 చోట్ల ఈవీఎంల మొరాయింపు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 45 నిమిషాల పోలింగ్ సరళి చూస్తుంటే.. ఈసారి భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నియోజకవర్గ పరిధిలో మొత్తం 11 చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెం.30లో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టెక్నికల్ టీమ్ హుటాహుటిన అక్కడికి వెళ్లనుంది. ఇక శ్రీనగర్ కాలనీలోని నాగార్జున కమ్యూనిటీ హాల్ పోలింగ్ కేంద్రంలో పవర్ కట్ అయింది. వెంగళ్‌రావు నగర్ డివిజన్ 76, 78 బూత్‌లలో ఈవీఎంలు పని చేయకపోవడంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో భారీగా క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహమత్ నగర్ పరిధిలోని 165, 166 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. పోలింగ్ సిబ్బంది అధికారులకు సమాచారం అందజేశారు.
READ MORE ....
టెన్షన్ పెట్టిస్తున్న జూబ్లీహిల్స్ బై పోల్.. ఎన్నికల అధికారికి BRS ఫిర్యాదుల పర్వం






