- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ బై పోల్ అప్‌డేట్.. తొలిరోజు 10 నామినేషన్లు దాఖలు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వేళ నామినేషన్ల పర్వం జోరందుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వేళ నామినేషన్ల పర్వం జోరందుకుంది. తొలిరోజుల మొత్తం 10 నామినేషన్లు దాఖలైనట్లుగా జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం (Sairam) వెల్లడించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాగా, తెలంగాణ పునర్‌నిర్మాణ సమితి తరఫున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అదేవిధంగా నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్‌రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్‌రెడ్డి, ఇబ్రహీం ఖాన్‌తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.
అయితే, నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి 100 మీ. వరకు ఆంక్షలు ఉంటాయని ఆర్వో సాయిరాం వెల్లడించారు. ఇక నియోజకవర్గ పరిధిలో దొంగ ఓట్ల (Fake Votes)పై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు చెబుతున్న 43 ఓట్లు 2023 అసెంబ్లీ (Assembly) ఎన్నికలు, 2024 పార్లమెంట్ (Parliament) ఎన్నికల్లో కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ 43 మంది కొత్తవాళ్లేం కాదని అన్నారు. దొంగ ఓట్లు ఏమీ లేవనే విషయాన్ని ప్రాథమిక విచారణలో తేల్చేశామని, పూర్తి రిపోర్టు సాయంత్రం వరకు వస్తుందని జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు.






