జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. BRS అభ్యర్థిగా మాగంటి సునీత

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-26 07:27:19  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ రాష్ట్ర సమితి జంగ్ సైరన్ పూరించింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. BRS అభ్యర్థిగా మాగంటి సునీత
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై భారత రాష్ట్ర సమితి (BRS) తెర దించింది. ఆ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత (Maganti Sunitha) పేరు ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా, అనారోగ్య కారణాలతో జూన్‌ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయనుంది. అయితే, తొలుత దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రానాథ్, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఫస్ట్ నుంచి గోపినాథ్ సతీమణి సునీతకే టికెట్ ఇచ్చేందుకు సముఖత చూపారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆమెను అభ్యర్థిగా ఖరారు ఫైనల్ చేస్తూ గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు.

ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవచ్చే ఆలోచనతో కేసీఆర్ అభ్యర్థిత్వానికి తెర దింపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జూబ్లీ‌హిల్స్ బై‌పోల్‌లో ఎలాగైన విజయం సాధించాలని ప్రత్యేక కార్యాచరణతో ముందకు వెళ్తున్నారు. ప్రతిరోజూ తెలంగాణ భవన్‌ వేదికగా బూత్ లెవల్‌లో డివిజన్ల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Next Story