- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ బై పోల్ హీట్.. కూటమికి బీజేపీ యత్నాలు
రాష్ట్రంలో కమలనాథులు జూబ్లీహిల్స్ఉప ఎన్నికలకు ఒంటిరిగా వెళ్లకుండా కూటమిగా జత కట్టేందుకు సిద్దమైతున్నట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కమలనాథులు జూబ్లీహిల్స్ఉప ఎన్నికలకు ఒంటిరిగా వెళ్లకుండా కూటమిగా జత కట్టేందుకు సిద్దమైతున్నట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది. రెండు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నాయకత్వం హస్తినలో ఒకసారి చర్చలు చేసినట్లు సమాచారం. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు అనువైన సమయమని భావిస్తున్నట్లు పార్టీ పెద్దలు చెప్పారు. గతంలో ఇక్కడ టీడీపీ విజయం సాధించడంతో ఇప్పటికి ఆపార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉందని గెలుపులో తమ్ముళ్ల ప్రభావం ఉంటుందని స్దానిక నేతలు భావిస్తున్నారు. సెటిలర్లు ఎక్కువ టీడీపీ వైపు మొగ్గు చూపుతారని ఆపార్టీతో కలిసి వెళ్లితే విజయ తీరాలకు చేరుకోవచ్చని బీజేపీ సీనియర్లు అంచనా వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ పోరులో గట్టేక్కితే త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవచ్చని అంచనాలో ఉన్నారు. పార్టీ హస్తిన పెద్దలు కూడా ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటితే రాబోయే ఎన్నికల్లో పార్టీ తన ప్రభావం చూపుతుందని, ఈసారి గత ఎన్నికల మాదిరిగా మూడో స్దానానికే పరిమితమైతే భవిష్యత్తులో తెలంగాణలో అధికారం చేపట్టడం కలగానే మిగులుతుందని పలు సమావేశాల్లో చెప్పినట్లు శ్రేణులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారం కాంగ్రెస్కు ప్రజల నుంచి ఎదురుగాలి వీస్తుందని, ప్రతిపక్ష బీఆర్ఎస్గత రెండు ఎన్నికల ఓటముల నుంచి తేరుకోలేదు. ఈరెండు పార్టీల బలహీనతలను గుర్తించి ప్రజలను తమ వైపు తిప్పకోవచ్చని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
కూటమి కోసం శత విధాలుగా టీడీపీ ప్లాన్
ఏపిలో టీడీపీ అధికారం చేపడటంతో జూబ్లీహిల్స్ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు ప్లాన్చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ప్రజల ముందుకు వెళ్లితే విజయం సాధించవచ్చని, కమలం పార్టీ పోటీ చేస్తే మద్దతు ఇవ్వడం కానీ, వారు పోటీ చేయకుంటే వారి సహకారంతో బరిలో నిలిచేందుకు తమ్ముళ్లు కాలు దువ్వుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది. 2014 ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి టీడీపీ ఓటు కాస్త తగిన ప్రస్తుతం గెలుపు ఓటముల్లో ప్రభావం చూపుతామని అంటున్నారు. కూటమికి చెందిన మూడు పార్టీల ఓటు బ్యాంక్ తోసులభంగా విజయం సాధించవచ్చని తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు.
జీహెచ్ఎంసీలో గెలుపు కోసం బీజేపీ వ్యూహాలు..
నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని, ఈసారి ఖచ్చితంగా మేయర్పీఠం దక్కించుకోవాలని కమలనాథులు వ్యుహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో 43 సీట్ల గెలుచుకుని విపక్ష పార్టీలను ఖంగు తినిపించింది. ఇంకా గట్టి పనిచేయడంతో పాటు మిత్ర పక్షంగా బరిలో నిలిస్తే సగానికిపై సీట్లు తమ ఖాతాలో వేసుకోవచ్చని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే కూటమిగా ప్రయానిస్తే భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీ విజయ పతకం ఎగురవేస్తుందని అంటున్నారు. కూటమి మంత్రం సక్సెస్అయితే 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఫార్ములా పాటించి మెజార్టీ సీట్లు గెలిచి అధికారం చేపట్టవచ్చని సీనియర్ల అభిప్రాయ పడుతున్నారు.
కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ఎత్తులు..
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ అభ్యర్దిని బరిలో నిలిపి కాంగ్రెస్బీసీ రిజర్వేషన్ల ఎత్తులు చిత్తు చేసేందుకు బీజేపీ ప్లాన్చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర ఇంచార్జీలు కూడా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రధాని మోడీకే సవాల్విసురుతున్నాడని, ఆయన కుట్రలు తిప్పికొట్టేందుకు బీసీ అభ్యర్థి మంచిగా పనిచేస్తుందని నయా ప్లాన్చేస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ఎన్నికల్లో రెండు పార్టీలను దెబ్బతీయడంతో పాటు నిజమైన బీసీ పార్టీ తమదేనని ముద్ర వేసుకునేందుకు వ్యుహాలు చేస్తున్నట్లు సమాచారం.






