జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తెలంగాణ బీజేపీ కీలక కమిటీ ఏర్పాటు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)ల విషయంలో తెలంగాణ బీజేపీ(Telangana BJP) దూకుడు ప్రదర్శిస్తోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తెలంగాణ బీజేపీ కీలక కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)ల విషయంలో తెలంగాణ బీజేపీ(Telangana BJP) దూకుడు ప్రదర్శిస్తోంది. ఉప ఎన్నిక కోసం మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు(Raghunandan Rao), పాయల్ శంకర్‌తో పాటు గౌతమ్ రావు, గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డిలకు అవకాశం కల్పించారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికారులు సైతం అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నారు. పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్‌ కర్ణన్ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు ఉన్న 329 పోలింగ్‌ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ముందస్తు ఏర్పాట్లను చేసేందుకు నోడల్‌ అధికారులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో డిపార్ట్మెంట్‌కు ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ఉప ఎన్నిక ఏర్పాట్లను వేగవంతం చేశారు.

Next Story