- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: కాసేపట్లో జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న ఆందోళన ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అక్కడి ఎమ్మెల్యే స్థానం ఖాళీ అవ్వగా ఉపఎన్నిక అనివార్యమైంది. ఈసారి మూడు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది.
నవంబర్ 11, మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఉపఎన్నిక పోలింగ్ జరగగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ 47.16 శాతం మంది ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు. 6 గంటల లోపు పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటువేసే అవకాశం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఈసారి వెబ్ కాస్టింగ్ తో పాటు డ్రోన్లతో నిఘా పెట్టామని తెలిపారు. పోలింగ్ పూర్తయిన కేంద్రాల్లో వెంటనే ఈఎంలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా.. మరికొద్దిసేపటిలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ రానుండగా.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమాతో ఉన్నాయి. ఈనెల 14వ తేదీన అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదేరోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.






