Jubilee Hills By-Election: వేగం పెంచిన బీఆర్ఎస్ నేతలు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై బీఆర్ఎస్(BRS) దూకుడు పెంచింది.

Jubilee Hills By-Election: వేగం పెంచిన బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై బీఆర్ఎస్(BRS) దూకుడు పెంచింది. అందరికంటే ముందు అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారంలో వేగం పెంచగా.. తాజాగా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహా తదితర ప్రముఖులతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravichandra) సమావేశం అయ్యారు. ఉప ఎన్నికపై వారికి కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీష్ కుమార్ యాదవ్, మంగళారపు లక్ష్మణ్, పుస్తె శ్రీకాంత్, వాసాల వెంకటేష్, పర్వతం సతీష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్ని కాలనీలు, బస్తీల్లో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామంటూ ముందుకెళ్తున్నారు. దాదాపు నెల రోజులుగా నియోజకవర్గంలోని 2 వేలకు పైగా గడపల్లోకి వెళ్లి మమేకవుతున్నారు. మాగంటి ఆశయ సాధనకు తమకు మద్దతుగా నిలువాలని కోరుతున్నారు.

Next Story