జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: హైదరాబాద్ మేయర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: హైదరాబాద్ మేయర్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: హైదరాబాద్ మేయర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా మంగళవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi), మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్(Anil Kumar Eravathri) ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ సమవేశం జరిగింది. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కట్టుబడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌పై అపారమైన నమ్మకం ఉంచారు. ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ, ప్రతి డివిజన్‌లో సమన్వయంతో పనిచేసి, నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నదే మా సంకల్పం అని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తా, నాయకుడు ఒక్కొక్కరు ఒక్కో డివిజన్‌లో బూత్ లెవెల్ వరకు చురుకుగా పనిచేయాలి. ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణ - ఇవే మన విజయ సూత్రాలు అని పిలుపునిచ్చారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగబోతోంది. అంటే ప్రచారానికి ఇంకా 6 రోజులే టైమ్ ఉంది. దీంతో అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.

Next Story