- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills By-Election: రంగంలోకి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) కోసం భారత ఎన్నికల సంఘం(Election Commission) పరిశీలకులను నియమించిన నియమించింది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) కోసం భారత ఎన్నికల సంఘం(Election Commission) పరిశీలకులను నియమించిన నియమించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణను నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్‌లను నియమించింది. ఈ అధికారులు ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఈ పరిశీలకులు ఎన్నికల నిబంధనల అమలు, శాంతి భద్రతలు, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ వంటి అంశాలను దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎన్నిక పూర్తి అయ్యేవరకూ వీరు అందుబాటులో ఉంటారు. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, శాంతి భద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియజేయవచ్చని ప్రజలకు, పార్టీలకు సూచించారు.






