TG: ప్రతిష్టాత్మక ఎన్నిక.. కాంగ్రెస్ పెద్దలు కలగజేసుకోకపోతే కష్టమేనా..?

by Gantepaka Srikanth |

త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు నెలకొనడం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మా రేలా కనిపిస్తోంది.

TG: ప్రతిష్టాత్మక ఎన్నిక.. కాంగ్రెస్ పెద్దలు కలగజేసుకోకపోతే కష్టమేనా..?
X

దిశ, జూబ్లీహిల్స్: త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు నెలకొనడం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మా రేలా కనిపిస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఒరిజినల్, ఫిరాయింపు నాయకుల మధ్య వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఫొటో లేకుండా ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఫొటో పెట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్ సీఎన్ రెడ్డికి ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో ఉంటున్న భవానీ శంకర్, ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ వెంకటస్వామి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి.

తాజాగా ఫ్లెక్సీ వివాదం విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ఈ నేపథ్యంలోనే వెంకటస్వామి ఫొటో పెట్టడాన్ని జీర్ణించుకోలేని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీని చించేశారు. గంజాయి, మద్యం మత్తులో సీఎన్ రెడ్డి అనుచరులు 10 మంది ఫ్లెక్సీ చించేశారని ఆరోపిస్తున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేత మధ్య నెలకొన్న మనస్పర్థలు కాంగ్రెస్ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు కలగజేసుకొని సమస్యపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

Next Story