Jubilee Hills By-Election: కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ రెడ్డి కీలక సూచన

by Gantepaka Srikanth |

పార్టీ(Telangana Congress), ప్రభుత్వం జోడేదుల్లా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు.

Jubilee Hills By-Election: కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ రెడ్డి కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ(Telangana Congress), ప్రభుత్వం జోడేదుల్లా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. మంగళవారం పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. 18 నెలల ప్రభుత్వపాలన గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్లగలుగుతామని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా కలిసి ఐకమత్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్‌లో పని చేయాలని ఆదేశించారు. పని చేస్తేనే పదవులు వస్తాయని అన్నారు.

పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం.. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలని హితవు పలికారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలని తెలిపారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను గ్రామస్థాయిలో పర్యటించడానికి.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు.

Next Story