- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: బండి సంజయ్ ఫినిషింగ్ టచ్.. ‘హైదరాబాద్ ఫైల్స్’ అంటూ షాకింగ్ కామెంట్స్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారం కాసేపట్లో ముగియనుంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారం కాసేపట్లో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలో అరాచకాలకు ఎంఐఎం అండదండలు ఉన్నాయని అన్నారు. బర్త్ డే పేరుతో పిలిపించి కేక్‌లో డ్రగ్స్ పెట్టి ఇస్తున్నారని ఆరోపించారు. పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు పెరిగిపోయాయని అన్నారు. మత్తులో మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. కేరళ ఫైల్స్ సినిమా తరహాలో హైదరాబాద్ ఫైల్స్ సినిమా జరుగుతోందని ఆరోపించారు. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లే అని చెప్పారు. హైదరాబాద్‌ను కాపాడుకోవాలంటే.. బీజేపీ ఓటు వేయాలని కోరారు. పొరపాటున కూడా మళ్లీ ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే.. జూబ్లీహిల్స్‌లోని పార్కులను కూడా దోచుకుంటారు జాగ్రత్త అని హెచ్చరించారు. కేటీఆర్‌తో కలిసి గోపీనాథ్ ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం మిస్టరీపై, ఆస్తులపై విచారణ జరిపించడం లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ఓడించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
READ MORE .....
రాముడి వారసులు కావాలా? ఔరంగజేబు వారుసులు కావాలా? జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోండి: బండి సంజయ్






