జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బరిలో 58 మంది

by Muthe.Rajitha |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఖరారయ్యారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బరిలో 58 మంది
X

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారి సాయిరాం వివరాలు వెల్లడించారు. బైపోల్ లో మొత్తం 211 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 81 మంది అర్హత సాధించారు. వీరిలో 23 మంది నామినేషన్లను ఉపసంహరించారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం జూబ్లీహిల్స్ చరిత్రలో ఇది తొలిసారి కావడం గమనార్హం. గత ఎన్నికల్లో 2009లో 13, 2014లో 21, 2018లో 18, 2023లో 19 మంది అభ్యర్థులు ఇక్కడినుంచి పోటీ చేశారు. 2023లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ ఎన్నికయ్యారు. కానీ ఆయన మరణంతో ఉపఎన్నిక అనివార్యం అయింది.

ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు స్వతంత్రులు, విద్యార్థి సంఘాలు, రైతులు భారీగా పోటీలో ఉన్నారు. అయితే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. రీజినల్ రింగు రోడ్డు భూసేకరణ నిర్వాసితులు 12 మంది, యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు 10 మంది, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 10 మంది, ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది, పింఛన్ల కోసం 9 మంది సీనియర్ సిటిజన్లు, తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒకరు నామినేషన్లు వేశారు. ఈ భారీ నామినేషన్లు, ఉత్కంఠభరిత వాతావరణం నడుమ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చర్చనీయాంశంగా మారింది.

Next Story