JP Nadda: ఆ విషయం గుర్తుపెట్టుకుంటే రేవంత్‌కే మంచిది.. నడ్డా సూచన

by Gantepaka Srikanth |

కాంగ్రెస్(Congress) పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda) కీలక వ్యాఖ్యలు చేశారు.

JP Nadda: ఆ విషయం గుర్తుపెట్టుకుంటే రేవంత్‌కే మంచిది.. నడ్డా సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానం(Saroornagar Ground)లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న నడ్డా మాట్లాడుతూ.. అబద్ధాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు తెలంగాణలో తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలన్నీ ఏకమైనా.. మూడోసారి కూడా ప్రజలు మోడీనే గెలిపించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో బీజేపీ(BJP) అధికారంలో ఉందని అన్నారు. ఎన్డీఏ కూటమి మరో ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని సూచించారు. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అనే సంగతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

ఇతర పార్టీలు బలహీనపడితే కాంగ్రెస్‌కు బలం అని అన్నారు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ గెలుస్తుందని విమర్శించారు. బీజేపీ నేరుగా పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇంతవరకూ గెలవలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. తెలంగాణకు పన్నుల కింద లక్షా 60 వేల కోట్ల సాయం కేంద్రం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ మూడు వందేభారత్ రైళ్లు(Vande Bharat Trains) కూడా మంజూరు చేసిందని అన్నారు. హైవేల కింద ఐదు భారత్‌మాల ప్రాజెక్టులు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని అన్నారు.

Next Story