పదవీ విరమణ జర్నలిస్టులకు పెన్షన్ అందించాలి.. డిప్యూటీ సీఎం భట్టికి వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తి

by Ramesh Naini |

పదవీ విరమణ చేసిన (Journalists) జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని వర్తింప చేయాలని వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తి చేసింది.

పదవీ విరమణ జర్నలిస్టులకు పెన్షన్ అందించాలి.. డిప్యూటీ సీఎం భట్టికి వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదవీ విరమణ చేసిన (Journalists) జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని వర్తింప చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో 17వ అంశంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సంఘం నాయకులు కేశవరావు, లక్ష్మణరావు, ఎన్. శ్రీనివాసరెడ్డి, బండారు శ్రీనివాసరావు, సి.కేశవులు, ఫాజిల్, వేణుగోపాల్ లతో కూడిన బృందం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘ నాయకులు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఈ అంశంపై విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తే.. సానుకూలంగా స్పందించినట్లు వయోధిక పాత్రికేయ సంఘం సభ్యులు గుర్తుకు చేశారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో పెన్షన్ పథకం అమలులో ఉన్నదని వారు తెలిపారు. కర్ణాటకతో సహా పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలులో ఉందని, ఈ విషయం కమిటీ వేసి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి అమలు జరిగేటట్లు ప్రయత్నిస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారని సంఘ నాయకులు తెలిపారు.

Next Story