- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.5 కోట్లు డిమాండ్ చేసిన రిపోర్టర్ కేసులో BIG ట్విస్ట్.. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే టార్గెట్ చేశాడుగా..!

దిశ, వెబ్‌డెస్క్: వ్యాపారికి ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన రిపోర్టర్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రిపోర్టర్ శ్యామ్(Reporter Shyam) ఫోన్ చేసింది సాదాసీదా వ్యాపారికి కాదట.. ఏకంగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)నే టార్గెట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు(Thota Laxmi Kantha Rao)ను బ్లాక్ మెయిల్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం రిపోర్టర్ శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గతంలో తీన్మార్ మల్లన్న దగ్గర రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావుకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే అవి బయట పెడతానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు శ్యామ్‌పై దోపిడీ కేసు నమోదు చేశారు. శ్యామ్‌ను అదుపులోకి తీసుకొని ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టులోని జడ్జీ ఎదుట ప్రవేశ పెట్టారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే ప్రజా సమస్యలపై పరిశోధనాత్మక కథనాలు రాస్తున్న జర్నలిస్ట్ మేనం శ్యామ్‌కు గొప్ప గౌరవం లభించింది. ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిస్ట్‌గా ఎంపిక అయ్యారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కారాలు అందజేస్తోంది. క్యూ న్యూస్ బ్యూరో చీఫ్ మేనం శ్యామ్‌ను ఉత్తమ పరిశో ధనాత్మక జర్నలిస్ట్‌గా ఎంపిక చేశారు.






