- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు
మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్ లు, ముదిరాజ్ సంఘ రాష్ట్ర నేతలు గాంధీ భవన్‌లో శుక్రవారం టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ చేరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్ లు, ముదిరాజ్ సంఘ రాష్ట్ర నేతలు గాంధీ భవన్‌లో శుక్రవారం టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ చేరారు. వారికి టీపీసీసీ చీఫ్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి నాయకుడికి కాంగ్రెస్ కుటుంబం తరఫున స్వాగతం పలుకుతూ, ప్రజాసేవలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో సర్పంచ్ లు దొంతరబోయిన నరేష్, సారంపల్లి దేవేంద్ర మోహన్ రెడ్డి, దారావత్ కైక, కేసముద్రం మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, రాష్ట్ర ముదిరాజు సంఘ కార్యదర్శి నీలం సుహాసిని దుర్గేష్, మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్, మాజీ ఎంపీటీసీ రవి నాయక్ తదితరులు ఉన్నారు.
వీరితో పాటు పెద్ద సంఖ్యలో వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్లు, మహబూబాబాద్ జిల్లా ముదిరాజు సంఘ యువ నాయకులు మరియు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, మహాబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఖైరతాబాద్ డీసీసీ చీఫ్మోత రోహిత్ ముదిరాజ్ లు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పట్ల ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నామన్నారు. ప్రజలకు న్యాయం చేసే పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.






