- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక హామీ.. స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఆ 150 మంది
స్థానిక సంస్థల ఎన్నికల వేళ విపక్ష బీఆర్ఎస్(BRS)కు అనూహ్య షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్‌లో చేరారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ విపక్ష బీఆర్ఎస్(BRS)కు అనూహ్య షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి(MLA Manohar Reddy) సమక్షంలో మాజీ సర్పంచ్‌తో పాటు 150 మంది హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయంలో నియోజకవర్గం అభివృద్ధి జరుగలేదని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమ రాజ్యం అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
ప్రజావాణిలో పదేళ్లు రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడ్డామని ప్రజలు చెబుతుంటే చలించిపోయామని అన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలో రేషన్ కార్డులు వస్తున్నాయని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందించే విధంగా కృషి చేస్తా.. అర్హులు ఎవరికీ అన్యాయం జరుగకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి పథకాలు అందించేలా కృషి చేస్తామని మాటిచ్చారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం చేయబోతున్నామని అన్నారు. తాండూరు ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు.






