- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు.. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ హైవోల్టేజ్ పాలిటిక్స్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ చేరికల రాజకీయం ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) రాజకీయం మరింత హీటెక్కుతోంది. ఎత్తుకు పై ఎత్తులతో ప్రధాన పార్టీలు సాగిస్తున్న పొలిటికల్ గేమ్ రసవత్తరంగా మారుతోంది. గెలుపు కోసం అందివచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా రాజకీయ వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో చేరికలపై పార్టీలు దృష్టి సారించాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో చేరికలు జరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో తన అనుచరులతో కలిసి వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి కాంగ్రెస్‍లో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వీరికి పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కాగా ఇటీవలే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు వడ్డెర సంఘం నాయకులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో వడ్డెల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి కాంగ్రెస్ గూటికి చేరడం ఆసక్తిగా మారింది.






