Johnny Master: ఐసీయూలో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్.. జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
Johnny Master: ఐసీయూలో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్.. జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అదేవిధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sritej) గత కొన్ని రోజులుగా కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బాధిత కుటుంబానికి హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)తో సహా, దర్శకుడు సుకుమార్ (Director Sukumar), మైత్రి మూవీస్ నిర్మాతలు కలిసి రూ.2 కోట్ల పరిహారం అందజేశారు. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ (Sritej) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీతేజ్‌ను చూడాలని అందరికీ ఆత్రుతగా ఉందని.. కొన్న పరిధుల వల్ల తాను ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నానని అన్నారు. తమ కొరియోగ్రాఫర్స్ సొసైటీ తరఫున శ్రీతేజ్ (Sritej) కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తన కేసు కోర్టు పరిధిలో ఉందని.. అందుకే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని జానీ మాస్టర్ అన్నారు.

Next Story

Most Viewed