మ‌హంకాళి బోనాల ఏర్పాట్ల‌పై జోగిని వైష్ణ‌వి కీల‌క వ్యాఖ్య‌లు

by Ajay Maddhiboyina |

సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల‌పై జోగిని వైష్ణ‌వి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌హంకాళి బోనాలు సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయ‌ని అన్నారు.

మ‌హంకాళి బోనాల ఏర్పాట్ల‌పై జోగిని వైష్ణ‌వి కీల‌క వ్యాఖ్య‌లు
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల‌పై జోగిని వైష్ణ‌వి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌హంకాళి బోనాలు సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయ‌ని అన్నారు. బోనాల‌ను స‌క్సెస్ చేసిన ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎలాంటి తోపులాట‌లు జ‌ర‌గ‌కుండా ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేశార‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 27 సంవ‌త్స‌రాల నుండి త‌న జీవితంలో అమ్మ‌వారికి సేవ చేస్తున్నాన‌ని అన్నారు. 27 సంవ‌త్స‌రాల నుండి అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పిస్తున్నాన‌ని చెప్పారు.

గ‌తంలో కొంత తోపులాట‌లు జ‌రిగేద‌ని ఈసారి మాత్రం ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చ‌క్క‌గా చేసింద‌న్నారు. మంత్రి కొండా సురేఖ‌, ఇత‌ర అధికారులు త‌మ‌తో స‌మావేశం నిర్వ‌హించి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశార‌న్నారు. ప్ర‌త్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి బాజాలు, బ‌జంత్రీలు ఏర్పాటు చేశార‌ని చెప్పారు. ప్రతిఒక్క‌టి అంద‌జేశార‌న్నారు. ప్ర‌భుత్వం నుండి తాము ఏమీ కోరుకోవ‌డం లేద‌ని భ‌క్తితో చేసిన బోనం అమ్మ‌వారి వ‌ద్ద‌కు చేరిస్తే చాల‌ని అన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

Next Story