కేటీఆర్ ఇంటికి వైసీపీ మాజీ మంత్రి.. జగనే పంపించాడా ?

by velandi.Saikiran |   (  Updated:2025-05-06 17:30:41  IST  )

తెలంగాణ రాష్ట్రంలో (Telangana) కీలక పరిణామం చోటు చేసుకుంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటికి వైసిపి

కేటీఆర్ ఇంటికి వైసీపీ మాజీ మంత్రి.. జగనే పంపించాడా ?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో (Telangana) కీలక పరిణామం చోటు చేసుకుంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటికి వైసిపి మాజీ మంత్రి వచ్చారు.. వైసిపి మాజీమంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh)... హైదరాబాదులో కేటీఆర్ ను కలిశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Ys Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... మంత్రిగా పనిచేసిన జోగి రమేష్... ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు.

ఈ సందర్భంగా... గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా మాజీ మంత్రి జోగి రమేష్ కలిశారు. ఈ తరుణంలోనే తమ కుమారుడి వివాహానికి తప్పక హాజరు కావాలని కేటీఆర్ ను ఆహ్వానించారు జోగి రమేష్. ఈ నెల చివరలో జోగి రమేష్ కుమార్ రెడ్డి వివాహం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో పలువురు రాజకీయ నాయకులకు కూడా.. ఈ ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ పార్టీకి కాస్త కేటీఆర్ క్లోజ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

అందుకే ముందుగా కేటీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు జోగి రమేష్. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా... ఏపీలో వైసీపీ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో జోగి రమేష్ కూడా ఓటమి పాలయ్యారు. మొన్నటి వరకు ఆయనపై కూడా కేసులు నమోదు అయ్యాయి.

Next Story