జోడో యాత్ర కాంగ్రెస్‌కు ప్లస్సా.. మైనస్సా?

by Disha Web Desk 4 |
జోడో యాత్ర కాంగ్రెస్‌కు ప్లస్సా.. మైనస్సా?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశాన్ని అత్యధిక ఏళ్లు పాలించిన పార్టీ.. 138 ఏళ్ల ఘనమైన చరిత్ర.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల గట్టి పునాది వంటివేవి గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ తలరాతను మార్చలేకపోయాయి. కేంద్రంలో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఏపీలో అయితే మొత్తం కాంగ్రెస్ ఖాళీ అయింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీకి పునర్వైభవం తేవాలనే ధృఢ సంకల్పంతో భారత్ జోడో యాత్రను గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో శ్రీకారం చుట్టారు. 140 రోజులకు పైగా దాదాపు 4వేల కిలో మీటర్లు రాహుల్ నడిచారు. 12 రాష్ట్రాలతో పాటు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ జోడో యాత్ర సాగింది. 12 బహిరంగ సభలు, 100 కు పైగా కార్నర్ సమావేశాల్లో రాహుల్ పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన సమస్యలపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ కేంద్రంలో అమలుపరుస్తున్న విధానాలతో పేద, మధ్య తరగతి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాదాపు అన్ని సభల్లో ప్రస్తావించారు.

కార్పొరేట్లకు మోడీ రెడ్ కార్పెట్ వేస్తున్నారని మండి పడ్డారు. జోడో యాత్ర జరుగుతుండగానే జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం సానుకూల అంశం. కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకిస్తున్న ఆయా పార్టీల నేతలు రాహుల్ భారత్ జోడో యాత్రకు సంఘీబావం తెలపడం కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్ కాగా రాహుల్ గాంధీ జోడో యాత్రలో దూకుడు ప్రసంగాలు లేకపోవడం మైనస్ పాయింట్. మోడీకి ప్రత్యామ్నాయ ఫిగర్‌గా రాహుల్ గాంధీ కనిపించడం లేదని.. జోడో యాత్రలో రాహుల్ ప్రసంగాలు తేలిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గాడిన పడని హస్తం పార్టీ

రాష్ట్రంలో రాహుల్ జోడో యాత్ర సందర్భంగా మునుగోడు బై పోల్ జరుగగా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టడంలో భాగంగా ఇటీవల కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రేని కాంగ్రెస్ అధిష్టానం అపాయింట్ చేసింది. అయిన సైతం ఐక్యంగా ఉంటేనే విజయం సాధించగలమని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని రాష్ట్ర నేతలకు పిలుపునిచ్చారు. జోడో యాత్ర సందర్భంగా పలువురు కీలక కాంగ్రెస్ నేతలు సైతం ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు.

సర్వేలో బీజేపీదే హవా..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎన్డీయే కూటమేనని ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వే లో తేలింది. బీజేపీ 284 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ కి 191 స్థానాలు రావచ్చని సర్వే తెలిపింది. జోడో యాత్రతో కాంగ్రెస్ జాతకం మారదని 37 శాతం మంది తేల్చారు. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి రాహుల్ గాంధీ తగిన వ్యక్తి అని కేవలం 26 శాతం మంది మాత్రమే అభిప్రాయ పడటం గమనార్హం. ప్రతిపక్ష సారథ్యానికి సైతం అరవింద్ కేజ్రీవాల్ సమర్థుడని ఈ సర్వే తేల్చింది. రాహుల్ జోడో యాత్ర ప్రభావం ఏ మేరకు ఉండనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read...

Telangana బడ్జెట్‌కు గవర్నర్ ఆమోద ముద్ర!



Next Story

Most Viewed