- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాధాపూర్‌లో ఐటీ కంపెనీ పేరుతో భారీ మోసం.. రోడ్డున పడిన 400 మంది
ఐటీ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ లో తరచూ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి..

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ లో తరచూ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి, బోర్డు తిప్పేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మాధాపూర్ లో అదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మాధాపూర్ లో ఒక ఐటీ కంపెనీ 400 మంది విద్యార్థులను నిండా ముంచేసింది. కంపెనీని నమ్మి లక్షల్లో డబ్బులు కట్టిన నిరుద్యోగులను కంపెనీ బురిడీ కొట్టించింది. ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు కంపెనీకి కోట్ల రూపాయల డబ్బు కట్టారు. NSN ఇన్ఫోటెక్ పేరుతో ఉన్న కంపెనీ ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది. కంపెనీ అధినేత స్వామినాయుడు ఇప్పుడు బోర్డు తిప్పేసి పరారు కావడంతో.. ఉద్యోగం కోసం డబ్బులు చెల్లించిన వారంతా లబోదిబోమంటున్నారు. ఐటీ ఉద్యోగం వస్తుందన్న ఆశతో కంపెనీకి డబ్బులు కట్టామని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని వాపోతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ కు వెళ్లిన బాధితులు.. కంపెనీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కంపెనీ నిర్వాహకుల కోసం వెతుకుతున్నారు.






