- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఉద్యోగాల పేరుతో మోసం.. జీతం 13వేలు చెప్పి 3వేలు చేతిలో పెట్టిన కంపెనీ
హైదరాబాద్‌లో ఉద్యోగాల పేరుతో ఓ కంపెనీ ఉద్యోగులను దారుణంగా మోసం చేసింది. మోతీనగర్‌లో నిర్వాస టెలికాం అనే ప్రైవేట్ కంపెనీ రూ.13వేలు జీతం ఇస్తామని చెప్పి రూ.3,800 చేతిలో పెట్టింది అంటూ బాధితులు వాపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఉద్యోగాల పేరుతో ఓ కంపెనీ ఉద్యోగులను దారుణంగా మోసం చేసింది. మోతీనగర్‌లో నిర్వాస టెలికాం అనే ప్రైవేట్ కంపెనీ రూ.13వేలు జీతం ఇస్తామని చెప్పి రూ.3,800 చేతిలో పెట్టింది అంటూ బాధితులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బాధితుడు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బాధితుడు కంపెనీవాళ్లు తన జీతం ఇవ్వడంలేదని ఆరోపించాడు. తన జీతం రూ.13వేలు అయితే ఇచ్చింది మాత్రం 3,800 అని వాపోయాడు. బాధితుడు వీడియో తీస్తున్న సమయంలో వీడియోలు తీస్తే నీకు జీతం వస్తుందా అంటూ కంపెనీ వాళ్లు ప్రశ్నించినట్టు కనిపిస్తుంది. నీకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు? ఎవరైనా ఇన్ ఫ్లుయెన్సర్లు ఉన్నారా అంటూ వెటకారంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. జీతం అడిగితే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ ఉన్న సిబ్బంది మేనేజర్ ప్రస్తుతం లేరని సమాధానం ఇస్తున్నారు. కాగా ఈ కంపెనీలో ఫ్రెషర్స్ ను ఉద్యోగాల పేరుతో నియమించుకున్నట్టు కనిపిస్తోంది.






