- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీసీసీల రాకతో ఉద్యోగావకాశాలు
రాష్ట్రానికి జీసీసీల రాకతో మన ఐటీ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు మరిన్ని ఉద్యోగావకాశాలు పెరుగుతాయని శ్రీధర్‌బాబు చెప్పారు.

జీసీసీల రాకతో ఉద్యోగావకాశాలు
- హైదరాబాద్‌ను ఎంచుకుంటున్న ప్రఖ్యాత కంపెనీలు
- నగరంలో మరో జీసీసీ కేంద్రం.. ముందుకొచ్చిన రీజెనరాన్
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి జీసీసీల రాకతో మన ఐటీ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు మరిన్ని ఉద్యోగావకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మంగళవారం రీజనరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ బ్యారీ కోవల్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంగళవారం సెక్రెటేరియట్‌లో మంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో జీసీసీ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్‌తో ఎంఓయూను మార్చుకున్నారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడి టాలెంట్ పూల్ అందుబాటులో ఉండటం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయని చెప్పారు. న్యూయార్క్‌లోని ట్యారి టౌన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం మన ప్రతిష్ఠను మరింత పెంచుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
రెజెనరాన్‌కు ఐర్లాండ్, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కార్యాలయాలు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జీసీసీ ప్రత్యేకమైన గ్లోబల్ హబ్‌గా పనిచేస్తుందని తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, అధునాతన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్, కమర్షియల్ అనలిటిక్స్ వంటి అత్యున్నత స్థాయి డిజిటల్ సేవలను అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 450 జీసీసీలు పనిచేస్తుండగా.. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. జీసీసీల కేంద్రంగా ముంబయి, ఢిల్లీ, చెన్నైలను అధిగమించి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీల రంగాల్లో ఉన్న బలమైన ఎకోసిస్టం ప్రపంచ కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధన, తయారీ రంగం, పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో రెజెనెరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారి కోవాల్, రెజెనెరాన్ జీసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఓనాట్, సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.






