- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరిఖని సింగరేణి ఆధ్వర్యంలో త్వరలో మెగా జాబ్ మేళా
సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రామగుండం 1 ఏరియా గోదావరిఖని లో

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రామగుండం 1 ఏరియా గోదావరిఖని లో వచ్చే ఆదివారం మే 18 న సింగరేణి ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 100 ప్రైవేటు సంస్థల లో వివిధ విభాగాల్లో 3 వేల ఖాళీలు భర్తీ కోసం ఎంపిక జరుగుతుందన్నారు . నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటోందని, ఈ నేపథ్యంలో పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎన్. బలరామ్ పిలుపునిచ్చారు.
ఇటువంటి జాబ్ మేళాలు ఇకపై ఇతర ఏరియాలలో కూడానిర్వహించడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ లో ఉద్యోగ నియామకాలతో పాటు, నిరుద్యోగ యువత అందరికీ ఏదో ఒక ఉపాధి లేదా ఉద్యోగం కల్పించడం కోసం ఈ తరహా కార్యక్రమాలను సింగరేణి సంస్థ స్వచ్ఛందంగా చేపడుతుందని , ఈ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణి సంస్థ సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఇప్పటికే మందమర్రి, రామగుండం-1, భూపాలపల్లి ఏరియాలలో ప్రారంభించామని ఇతర ఏరియాలలో కూడా త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వీలుగా జాబ్ మేళాలను కూడా ఏర్పాటు చేయిస్తున్నట్లు సీఎండీ బలరామ్వివరించారు.






