జీఓ 317 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి.. మంత్రులను కోరిన ఉద్యోగ జేఏసీ

by Ramesh Naini |

గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317 కారణంగా వేల సంఖ్యలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత ఉందని ఉద్యోగ జేఏసీ నాయకులు గాల్​రెడ్డి హర్షవర్ధన్ ​రెడ్డి పేర్కొన్నారు.

జీఓ 317 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి.. మంత్రులను కోరిన ఉద్యోగ జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317 కారణంగా వేల సంఖ్యలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత ఉందని ఉద్యోగ జేఏసీ నాయకులు గాల్​రెడ్డి హర్షవర్ధన్ ​రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బాధితులకు పరిష్కారం అందించాలని శనివారం మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్​ ను కలిశారు. జేఏసీ నాయకుల వినతులపై మంత్రులు సానుకూలంగా స్పందించి వచ్చే వారం సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని అంశాలను లోతుగా చర్చించి, బాధితులకు తగిన పరిష్కారం కనుగొంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ, జీఓ 190 ప్రకారం తాత్కాలిక డెప్యూటేషన్లలో డిస్లోకేటెడ్, నాన్-డిస్లోకేటెడ్ అనే తేడాలు లేకుండా అందరికీ అవకాశం కల్పించాలి.. పంచాయతీ సెక్రటరీల మాదిరిగానే మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల వారికి కూడా వెంటనే న్యాయం చేయాలి.. విద్యాశాఖలో రేషనలైజేషన్ తో తక్కువ మందికే న్యాయం జరుగుతుంది.. వెంటనే తాత్కాలిక డెప్యూటేషన్ ప్రక్రియలో దీనిని పరిగణనలోకి తీసుకోవద్దు.. జీఓ 190లో అప్‌గ్రేడ్ అయిన భాషా పండితులకు కూడా తాత్కాలికంగా ఇచ్చే డెప్యూటేషన్ పొందే అవకాశం కల్పించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నాయకులు నాగేశ్వర్ రావు, మధుసూదన్ రెడ్డి, రమేష్​, శానమోని నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Next Story