జాబ్ క్యాలెండర్ ఏమాయె రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

by Kema Shiva Kumar |

ఎన్నికల మందు జాబ్ క్యాలెండర్ (Job Calendar) హాడావుడి చేశారని.. ఇప్పుడు అది ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

జాబ్ క్యాలెండర్ ఏమాయె రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల మందు జాబ్ క్యాలెండర్ (Job Calendar) హాడావుడి చేశారని.. ఇప్పుడు అది ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో నిరుద్యోగులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ పోరాటానికి బీఆర్ఎస్ (BRS) పార్టీ మద్దుతు ఇవ్వాలని కోరారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున యువతకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.

ప్రియాంక.. సీఎంకు మొట్టికాయలు వెయ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఏడాదిలోపు అన్ని ఉద్యోగాల భర్తీకి మాటిస్తున్నానని చెప్పారనే విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. అదేవిధంగా ఐదు అంశాలతో కూడిన యూత్ డిక్లరేషన్‌ (Youth Declaration)ను ఆమె చేతుల మీదుగ విడుదల చేయించారని తెలిపారు. యువత ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బాధ్యత తీసుకున్న ప్రియాంక గాంధీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. 20 నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌పై ఎలాంటి ప్రకటన చేయడం లేదని.. ఈ విషయంలో గాంధీల కుటుంబ గౌరవం, పరువు పోతోందని ప్రియాంక, సీఎం రేవంత్‌కు రెండు మొట్టికాయలు వేసి అడగాలని డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్‌లో ఐదు అంశాలు చెప్పారని.. అందులో ఏ ఒక్కటి అమలు కాలేదని ఆక్షేపించారు. అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 పెన్షన్, ఉద్యోగం అన్నారని.. అందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తొలి యేడులోని ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి.. దోఖా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కాస్త.. జాలీ నోట్ల క్యాలెండర్ అయిందని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గప్పించారు.

Next Story