దామరచర్ల నిర్వాసితులకు రేపు ఉద్యోగ నియామక పత్రాలు

by Muthe.Rajitha |

యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చబోతోంది.

దామరచర్ల నిర్వాసితులకు రేపు ఉద్యోగ నియామక పత్రాలు
X

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చబోతోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(YTPP) కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే మాటను నిలబెట్టుకోనుంది తెలంగాణ సర్కార్. ఈ ప్రాజెక్టు కోసం 1,133.14 హెక్టార్ల భూమిని సమకూర్చిన వారికి ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఉద్యోగాలను కేటాయించింది. ఈ సందర్భంగా రేపు ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 320 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. కాగా వీరందరూ తెలంగాణ జెన్కోలో వివిధ విభాగాల్లో ఉద్యోగులుగా నియమితులవుతారు.

Next Story