Jennifer Larson: హైదరాబాద్ వేగంగా డెవలప్ అవుతోంది.. జెన్నిఫర్ లార్సన్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ (ఏఎంజీఈఎన్) హైదరాబాద్‌లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్‌ను ప్రారంభించింది.

Jennifer Larson: హైదరాబాద్ వేగంగా డెవలప్ అవుతోంది.. జెన్నిఫర్ లార్సన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ (AMGEN) హైదరాబాద్‌లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్‌ను ప్రారంభించింది. సొమవారం హైటెక్‌సిటీ సమీపంలో‌ని అమ్జెన్ కార్యాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) అమ్జెన్ ఇన్నోవేషన్ సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ (Consul General Jennifer Larson) యూఎస్-ఇండియా రిలేషన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో పాల్గొన్నట్లు చెప్పారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ఇంక్రెడిబుల్ ఇండియా అంటూ హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోడీ ఇటీవల అమెరికా పర్యటనలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారని గుర్తుకు చేశారు. ఎన్నో ద్వైపాక్షిక చర్చలు జరిపారని వివరించారు. హైదరాబాద్‌లో ఆమ్జెన్ కంపెనీ విస్తరించాలనుకోవడం యూఎస్-ఇండియా రిలేషన్స్‌కి చక్కని ఉదాహరణ అని కొనియాడారు. ఇక బయెటెక్నాలజీ, డిజిటల్ ఇన్నొవేషన్‌లో హైదరాబాద్ వేగంగా డెవలప్ అవుతోందని జెన్నిఫర్ లార్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఆమ్జెన్ సంస్థ ప్రతినిధులకు ఆమె విషెస్ తెలియజేశారు.

Next Story