- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాలలో హైవోల్టేజ్ పాలిటిక్స్.. ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఏకంగా ఈసీకి ఫిర్యాదు
జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వేడి రాజుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో:జగిత్యాల కాంగ్రెస్‍లో (Jagtial Congress) ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay), మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) మధ్య వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతోంది. మున్సిపల్ టికెట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్యపోరు కలకలం రేపగా ఆ మంటలు ఇంకా చల్లారడం లేదు .తాజాగా ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖద్వారా కోరారు. అయితే బీఆర్ఎస్ తరఫున గెలిచిన సంజయ్ ఆ పై కాంగ్రెస్ లోకి రావడం పట్ల గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ఈసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. పోలింగ్‍కు ముందు రాసిన ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జీవన్ రెడ్డిపై చర్యలు?:
సంజయ్ విషయంలో మొదటి నుంచి జీవన్ రెడ్డి పార్టీకి సమస్యాత్మకంగా మారారనే చర్చ జరుగుతోంది. తాను అసలైన కాంగ్రెస్ వాదినని జీవన్ రెడ్డి చెబుతుంటే అభివృద్ధికోసం తాను ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంజయ్ వర్గానికే కేటాయించి తన వర్గానికి అన్యాయం చేశారని జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దింపి వారి తరఫున ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా సంజయ్ పై ఈసీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాశంగా మారింది. జీవన్ రెడ్డి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న అధిష్టానం ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనపై చర్యలు ఏమైనా తీసుకోనుందా అనే చర్చ జరుగుతోంది?.






