- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంజయ్ హయాంలో జగిత్యాల అవినీతికి అడ్డాగా మారిపోయింది: జీవన్ రెడ్డి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. సంజయ్ హయాంలో జగిత్యాల అవినీతికి అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. జగిత్యాల మున్సిపాలిటీని సంజయ్ భ్రష్టు పట్టించారని అన్నారు. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలపై తాను ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉన్నానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. సంజయ్ హయాంలో జగిత్యాల అవినీతికి అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. జగిత్యాల మున్సిపాలిటీని సంజయ్ భ్రష్టు పట్టించారని అన్నారు. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలపై తాను ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉన్నానని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగిత్యాలలో 16 మంది కమిషనర్లు మారారని అన్నారు. 8 మంది మున్సిపల్ అధికారులు జైలు పాలయ్యారని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ దాడులేనా మీ పాలన అంటూ ప్రశ్నించారు. ఇదేనా మీ ప్రగతికి నిదర్శనం అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను సంజయ్ దోచుకుంటున్నారని అన్నారు. జగిత్యాలలో సంజయ్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులతో గతంలో చైర్ పర్సన్ శ్రావణి రాజీనామా చేశారని ఆరోపించారు. ఇదిలా ఉంటే జగిత్యాలలో చాలాకాలంగా ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి అన్న విధంగా రాజకీయాలు కనిపిస్తున్నాయి. సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. ఆనాటి నుండి నేటి వరకు సంజయ్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో జగిత్యాలలో సొంతపార్టీ నేతల కుమ్ములాటలతో రాజకీయాలు హాట్ హాట్ గానే ఉంటున్నాయి.






