రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. బీఆర్ఎస్ గూటికి జీవన్ రెడ్డి చేరికకు ముహుర్తం ఫిక్స్!

by Prasad Jukanti |   (  Updated:2026-04-03 10:12:16  IST  )

జీవన్ రెడ్డి చేరిక ద్వారా బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో కలక సందేశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. బీఆర్ఎస్ గూటికి జీవన్ రెడ్డి  చేరికకు ముహుర్తం ఫిక్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (T Jeevan Reddy) బీఆర్ఎస్ చేరికకు మూహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీన ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 7వ తేదీన జగిత్యాలకు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అవుతారని ఈ సందర్భంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటన ముగించుకుని రాగానే జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గత నెల 25న పార్టీతో తనకు ఉన్న 40 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతూ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్ బిగ్ స్కెచ్:

జీవన్ రెడ్డి చేరికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నాయకత్వం ఈ చేరికతో మరో స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి చేరిక తర్వాత జగిత్యాల వేదికగానే బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం అధికార పార్టీ జోరుతో క్షేత్ర స్థాయిలో డీలాపడిన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఊపు తీసుకువచ్చేలా ప్లీనరీ సమావేశానికి ప్రణాళికలు రచిస్తుండగా జీవన్ రెడ్డి లాంటి కీలక నేతలు పార్టీలోకి వస్తే వారికి తగిన గుర్తింపు కూడా ఉంటుందనే సంకేతాలు క్షేత్రస్థాయిలోకి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story