- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congrress: నువ్వెవడివి.. జగిత్యాల ఎమ్మెల్యేపై రెచ్చిపోయిన జీవన్ రెడ్డి
జగిత్యాల కాంగ్రెస్ లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు చల్లారడం లేదు.

దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాల కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) వర్సెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (Jagtial MLA Sanjay Kumar) మధ్య వివాదం చల్లారడం లేదు. తాజాగా మరోసారి ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ కాంగ్రెస్ జెండా మోయని వారు పార్టీ గురించి మాట్లాడుతున్నారని పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్లకు టికెట్లు ఇస్తానని అనడం హ్యాస్పదంగా ఉందని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కథ తేలుతుందని ఆశిస్తున్నానన్నారు. 50 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుగకు సాగుతామన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి పై చర్చకైనా సిద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అంగట్లో సరుకు కాదని అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కార్యకర్తలు జెండాలు మోశారన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు ఇవ్వు స్వాగతిస్తాం. కానీ ప్రభుత్వ విధానాలు నచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీనే తొక్కుతానంటే నువ్వెవరివి అటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






