Jeevan Reddy: బీఆర్ఎస్ కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం: జీవన్ రెడ్డి

by Prasad Jukanti |

బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీలపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Jeevan Reddy: బీఆర్ఎస్ కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం: జీవన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నదంటే ఆ ఘటన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకుని ఏకాభిప్రాయంతో బీసీ బిల్లులను (BC reservations) ఆమోదింపజేసిందన్నారు. బిల్లులు కేంద్రానికి పంపి నాలుగు నెలలు అవుతున్నా కేంద్రం మాత్రం నిర్ణయం తీసుకోలేక నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని దుయ్యబట్టారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రంలో మద్దతు ఇచ్చిన బీజేపీ (BJP) కేంద్రంలో మాత్రం అడ్డుకుంటోందని విమర్శించారు. చివరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ పంపితే దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపండం రాష్ట్రంలో బీసీలను ఆందోలనకు గురి చేస్తోందన్నారు. కేంద్రం తన భాద్యత నెరవేర్చకుండా ద్వంద్వ నీతి అవలంభించడంతో బీజేపీ నిజ రూపం బయటపడిందన్నారు. రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఇవ్వడం లేదని వెనకబాటుతనంతోనే కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్లలో కొత్త అంశాలేమి లేవన్నారు. అయినా వాస్తవాలను వక్రీకరించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ సభపై స్పందించిన ఆయన వాళ్ల పార్టీ వారిష్టం అన్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం అన్నారు. బీఆర్ఎస్ (BRS)కు బీసీ రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Next Story